HomeTelugu Big Stories'హీరో' మూవీ ట్రైలర్‌

‘హీరో’ మూవీ ట్రైలర్‌

HERO movie Trailer

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘హీరో’. శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సంక్రాంతి బరిలో నిలబడుతున్న ఈ సినిమా ట్రైలర్ ని తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

‘కలల్లో బిర్యానీ వండుకుంటే రియాలిటీలో కడుపు నిండదురా.. రియాలిటీలోకి రా..’ అని నరేశ్ చెప్పే డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. సినిమా హీరో కావాలని కలలు కనే నేటి తరం కుర్రాడి పాత్రలో అశోక్ కనిపిస్తున్నాడు. దీనికి అతని తల్లి సైడ్ నుంచి సపోర్ట్ లభిస్తుండగా.. తండ్రి (నరేష్) మరియు ప్రేయసి ఫాదర్ (జగపతి బాబు) మాత్రం ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవడం అంత సులభం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

హీరోగా అశోక్ గల్లా మొదటి సినిమానే అయినా అలా ఎక్కడ ట్రైలర్ లో కనిపించలేదు. గిబ్రాన్ మ్యూజిక్ ట్రైలర్ కి ప్లస్ అని చెప్పొచ్చు. జనవరి 15 న విడుదల అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకోనుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu