HomeTelugu Big Storiesఎక్స్‌పోజింగ్‌ కాకుండా ఇంకేమైనా చేశావా.. నిధి అగర్వాల్‌ పై నెటిజన్ల కామెంట్స్‌

ఎక్స్‌పోజింగ్‌ కాకుండా ఇంకేమైనా చేశావా.. నిధి అగర్వాల్‌ పై నెటిజన్ల కామెంట్స్‌

10 10రామ్‌ హీరోగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. నిధి అగర్వాల్‌, నభా నటేష్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జులై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను అభిమానులతో పంచుకుంది నిధి అగర్వాల్‌. ఈ ట్రైలర్‌ చూసి ఓ నెటిజన్‌ వెటకారంగా కామెంట్‌ చేయగా, నిధి చాలా కూల్‌గా సమాధానం ఇచ్చింది.

నిధి అగర్వాల్‌ ట్వీట్‌ చేసిన ట్రైలర్‌ను ఉద్దేశిస్తూ, సదరు నెటిజన్‌ ‘ఎక్స్‌పోజింగ్‌ కాకుండా ఇంకేమైనా చేశావా ఈ సినిమాలో’ అంటూ కాస్త వెటకారంగా కామెంట్‌ చేయడంతో నిధి కాస్త సంయమనంతోనే సమాధానం ఇచ్చింది. ‘చాలా చేశాను. ట్రైలర్‌ కాదు. మూవీ చూడు’ అంటూ చురకలంటించింది.

ఇక ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ ట్రైలర్‌2 చూసిన వర్మ కూడా పూరీ జగన్నాథ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ‘వావ్‌ పూరీ నీ మాస్‌ మసాలా ట్రేడ్‌ మార్క్‌ పంచ్‌ డైలాగ్‌లతో తిరిగి వచ్చేసినట్లు ఉన్నావ్‌. రామ్‌ను ఇలా ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. నిధి అగర్వాల్‌ సూర్యుడి కన్నా హాట్‌గా ఉంది’ అని ట్వీట్‌ చేశారు. దీనికి నిధి అగర్వాల్‌ సమాధానం ఇస్తూ ‘థ్యాంక్యూ సర్‌. మీ రంగీలాకు అతి పెద్ద అభిమానిని’ అని పేర్కొంది. పూరి కనెక్ట్స్‌, పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై ఛార్మి నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!