
Prabhas Raja Saab Teaser:
ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రాజా సాబ్ టీజర్ ఇటీవలే విడుదలైంది. టీజర్ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంతో పాటు సినిమాపై హైప్ ను మరింత పెంచింది. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేశారు.
ప్రెస్ మీట్‌లో మారుతి మాట్లాడుతూ, “చర్చల సమయంలో ప్రభాస్ నన్ను అడిగాడు – సినిమాలో రెండు హీరోయిన్‌లు ఉంటే బాగుంటుందా అని. అప్పుడు నేను ఏకంగా మూడు బ్యూటీలను తీసుకున్నాను” అని నవ్వుతూ చెప్పారు. ఈ సినిమాలో మలవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. వీరంతా రాజా సాబ్ లో హాన్టెడ్ హౌస్‌లో కనిపించబోతున్నారు.
అలాగే, తన గత చిత్రం పక్కా కమర్షియల్ ఫ్లాప్ అయినా కూడా ప్రభాస్ తనపై నమ్మకాన్ని పెట్టుకున్నాడని మారుతి చెప్పారు. “ఒక నిర్మాత అప్పట్లో ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఎలాంటి సందేహం లేకుండా నా మీద బలమైన నమ్మకాన్ని చూపించాడు” అన్నారు. ఈ మాటలు మారుతి మరియు ప్రభాస్ మధ్య ఉన్న మంచి బాంధవ్యాన్ని తెలియజేస్తున్నాయి.
ఈ ప్రాజెక్ట్ కోసం మారుతి చాలా నెలలపాటు కథను సిద్ధం చేశారు. ప్రస్తుతం షూటింగ్ చివరిదశకు చేరుకుంది. రాజా సాబ్ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. నిర్మాత టి.జి. విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ, “ఇది ప్రభాస్ కెరీర్‌లోనే భారీ సినిమా అవుతుంది. హర్రర్ కామెడీగా విభిన్నమైన ఎంటర్టైన్మెంట్ మరియు అద్భుతమైన మ్యూజిక్ అందిస్తాం” అని తెలిపారు. ఈ సినిమా కోసం ఇండస్ట్రీలోనే అతిపెద్ద ఇండోర్ సెట్ ను నిర్మించారు.
ALSO READ: అమీర్ ఖాన్ Sitaare Zameen Par కి ఆఖరి నిమిషంలో కూడా కష్టాలే..