HomeTelugu Trending"ఇస్మార్ట్‌" కుటుంబంలోకి నిధి అగర్వాల్‌కు స్వాగతం

“ఇస్మార్ట్‌” కుటుంబంలోకి నిధి అగర్వాల్‌కు స్వాగతం

6a 2

పూరి​ జగన్నాద్‌, రామ్‌ కాంబినేషన్‌లో “ఇస్మార్ట్‌ శంకర్‌” మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలను ప్రారంభించిన చిత్ర యూనిట్‌.. రెగ్యులర్‌ షూటింగ్‌లో బిజీగా ఉంది. ఈ సినిమాలో రామ్‌కు జోడీగా నిధి అగర్వాల్‌ను ఎంపిక చేసినట్టు చిత్రయూనిట్‌ ప్రకటించింది. మా “ఇస్మార్ట్‌” కుటుంబంలోకి నిధి అగర్వాల్‌కు స్వాగతం అని నటి ఛార్మి ట్వీట్‌ చేశారు. దీంతోపాటు పోస్టర్‌ను షేర్‌ చేశారు.

నాగ చైతన్య హీరోగా రూపొందిన ‘సవ్యసాచి’తో టాలీవుడ్‌లో ఎంటరైన నిధి అగర్వాల్.. ఆ తర్వాత అఖిల్ మూవీ ‘మిస్టర్ మజ్ను’లో మెరిసింది. ఏ నటికైనా ఇంతకంటే గొప్ప లాంచ్ దొరకదు. కానీ చేసిన ఆ రెండు సినిమాలు పెద్దగా రాణించలేకపోయాయి. దీంతో ఇక ఆమె పనైపోయిందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా యువ హీరోలు చాలా మంది ఆమె వైపే చూస్తున్నారు. తాజాగా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో కథానాయికగా ఈమెనే తీసుకున్నారు. అంతేకాదు ఇంకొందరు దర్శక నిర్మాతలు కూడా ఈమెనే తమ సినిమాలో హీరోయిన్‌గా తీసుకోవాలనుకుంటున్నారట.

‘ఇస్మార్ట్ శంకర్’ మూవీలో ఆశిష్‌ విద్యార్థి, సత్య దేవ్‌, సుధాన్ష్‌ పాండేలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతా​న్ని అందిస్తున్నారు. ఈ మూవీని సమ్మర్‌లో రిలీజ్‌ చేసేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu