HomeTelugu Trendingనిహారిక ప్రీ వెడ్డింగ్‌ ఫొటోలు వైరల్‌

నిహారిక ప్రీ వెడ్డింగ్‌ ఫొటోలు వైరల్‌

Niharika Pre Wedding Photo
మెగా డాటర్‌ నిహారిక పెళ్లిపనులు మొదలైపోయ్యాయి. ‘డిసెంబ‌ర్ 9’న ఉద‌య్ పూర్ ప్యాలెస్ వేదిక‌గా చైత‌న్య‌ని వివాహం చేసుకోనుంది. గ‌త మూడు రోజులుగా నిహారిక ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ ఘ‌నంగా జ‌రుగుతుండ‌గా ఇందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తాజాగా నిహారిక త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ మూడు ఫొటోలు షేర్ చేసింది.

ఈ ఫొటోల‌లో ఇద్ద‌రు అమ్మాయిలు నిహారిక కాళ్ళు ప‌ట్టుకున్న‌ట్టు క‌నిపిస్తుండ‌గా, నిహారిక మాత్రం నవ్వుతూ.. ఫొటోల‌కు ఫోజులిచ్చింది. ఈ ఫొటోలపై క్లారిటీ ఇచ్చిన నిహారిక ప్రిన్స్ .. వాళ్ళు నా హీల్స్ సెట్ చేస్తున్నారు. ఒక పెళ్లి కూతురికి స‌హాయ‌కురాలిగా వాళ్ల క‌ర్త‌వ్యం బాగా చేస్తున్నారు. ల‌వ్ యూ గార్ల్స్‌ అంటూ నిహారిక కామెంట్ పెట్టింది. కాగా, నిహారిక-చైత‌న్య పెళ్లి వేడుక రాజ‌స్తాన్‌లో జ‌ర‌గ‌నుండ‌గా, డిసెంబ‌ర్ 11న హైద‌రాబాద్‌లో రిసెప్ష‌న్ జ‌ర‌గ‌నుంది.

 

View this post on Instagram

 

A post shared by Niharika Konidela (@niharikakonidela)

Recent Articles English

Gallery

Recent Articles Telugu