నిఖిల్ నెక్స్ట్ సినిమా స్టార్ డైరెక్టర్ తోనే!

నిఖిల్ అనగానే స్వామిరారా, కార్తికేయ సినిమాల్లో నటించిన నిఖిల్ అనుకోకండి. నిఖిల్ గౌడ
మాజీ కర్నాటక సీఎం హెచ్.డి.కుమారస్వామి తనయుడు. సుమారుగా 70 కోట్ల బడ్జెట్ తో
రూపొందిస్తున్న ‘జాగ్వార్’ చిత్రంతో నిఖిల్ హీరోగా పరిచయం కానున్నాడు. ఈ సినిమా
తరువాత నిఖిల్ ను స్టార్ డైరెక్టర్ చేతిలో పెట్టాలని కుమారస్వామి భావిస్తున్నాడు. దీని కోసం
త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, పూరీ జగన్నాథ్ వంటి దర్శకులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
వీరిలో ఎవరో ఒకరితో తన కొడుకు సినిమా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. అలానే తన
సొంత బ్యానర్ లో పవన్ కల్యాణ్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనికి
పవన్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని చెబుతున్నారు. ఈ సినిమాతో పాటు జగపతి బాబును
హీరోగా పెట్టి మరో సినిమా చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.

CLICK HERE!! For the aha Latest Updates