HomeTelugu Trendingనిఖిల్‌ బర్త్‌డే స్పెషల్‌: 'కార్తికేయ-2' న్యూపోస్టర్‌

నిఖిల్‌ బర్త్‌డే స్పెషల్‌: ‘కార్తికేయ-2’ న్యూపోస్టర్‌

Nikhil new poster from

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం ”కార్తికేయ 2”. చందు మొండేటి – నిఖిల్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘కార్తికేయ’కి సీక్వెల్ గా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకి కూడా చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి రహస్యం ఆధారంగా థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

అయితే నేడు హీరో నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు విషెస్‌ తెలుపుతూ ఓ సరికొత్త పోస్టర్ ని రిలీజ్‌ చేసింది మూవీ యూనిట్‌. ఈ పోస్టర్ లో ‘రక్షకులు సంక్షోభంలో ఉద్భవించారు’ అని పేర్కొన్నారు. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిభోట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కోవిడ్ కారణంగా వాయిదా పడిన ‘కార్తికేయ 2’ షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu