HomeTelugu NewsNikkhil Advani : సౌత్ పరిశ్రమలతో పోలిస్తే బాలీవుడ్‌లో అది చాలా తక్కువ

Nikkhil Advani : సౌత్ పరిశ్రమలతో పోలిస్తే బాలీవుడ్‌లో అది చాలా తక్కువ

Nikkhil Advani

Nikkhil Advani : ప్రస్తుతం సౌత్ సినీ పరిశ్రమ తన సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటుకుంటుంది. పాన్‌ ఇండియా సినిమాతో, అరుదైన గౌరవాలు సాధిస్తూ దూసుకెళ్తుంది. అంతేకాక సౌత్ సినిమాలు బాలీవుడ్లో కూడా మంచి విజయాలు సాధిస్తున్నాయి.

సౌత్‌ హీరోహీరోయిన్లు, డైరెక్టర్‌లు కూడా బాలీవుడ్‌లో తమ టాలెంట్‌ని చూపిస్తు మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇటీవలే బాలీవుడ్ లో చెప్పుకోదగ్గ హిట్ సినిమాలు ఎక్కువగా రావట్లేదు. ఈక్రమంలో అందరూ బాలీవుడ్, సౌత్ పరిశ్రమలని కంపేర్ చేసి చూస్తున్నారు.

తాజాగా బాలీవుడ్ దర్శక నిర్మాత నిఖిల్ అద్వానీ సౌత్, బాలీవుడ్ ని కంపేర్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్ హో నహో, సలాం ఏ ఇష్క్, చాందిని చౌక్ టు చైనా, డి డే.. లాంటి సూపర్ హిట్ సినిమాలతో దర్శకుడిగా సక్సెస్ అయ్యారు నిఖిల్ అద్వానీ.

మరో పక్క నిర్మాతగా కూడా పలు సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్ అద్వానీ మాట్లాడుతూ.. సౌత్ సినీ పరిశ్రమ, ముఖ్యంగా తెలుగు, తమిళ్ లో వర్క్ లో ప్రొఫెషనలిజం ఉంటుంది. హిందీ సినీ పరిశ్రమలో ఐక్యత లేదు. అందరూ ఒకరికొకరు పోటీ పడాలని చూస్తారు.

ఒకరు సక్సెస్ కొడితే ఇంకొకరు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోరు. బాలీవుడ్ లో మన అందరం ముందుకొచ్చి మనమంతా ఒక్కటే అని చెప్పగలగాలి. సౌత్ పరిశ్రమలతో పోలిస్తే మనలో ఐక్యత చాలా తక్కువ అని అన్నారు. దీంతో నిఖిల్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో చర్చగా మారాయి. గతంలో కూడా పలువురు సౌత్‌ పరిశ్రమ విజయంపై ప్రశంసలు చేసిన సంగతి తెలిసిందే.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu