రానాకు జీరో రెమ్యూనరేషన్!

దగ్గుబాటి రానా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు సురేష్ బాబు సమర్పకుడిగా వ్యవహరించగా భరత్ చౌదరి, కిరణ్ రెడ్డి సినిమాను నిర్మించారు. అయితే నిర్మాతల నుండి రానా ఒక్క రూపాయి కూడా పారితోషికంగా తీసుకోలేదట. ఈ విషయాన్ని స్వయంగా రానా వెల్లడించారు. ఎందుకు పారితోషికం తీసుకోలేదని ప్రశ్నించగా, ‘నేను రెమ్యూనరేషన్ తీసుకుంటే తరువాత మా నాన్న నాకు ఇంట్లో తిండి పెట్టడేమో అని భయమేసింది. అందుకే పారితోషికం తీసుకోలేదు’ అని చమత్కరించాడు. 
పారితోషికం తీసుకోలేదంటే.. తరువాత లాభాల్లో వాటా తీసుకుంటాడేమో అంటున్నారు. రానా ఇండస్ట్రీకు వచ్చిన ఇన్నేళ్లకు తన సొంత బ్యానర్ లో నటించాడు. అలాంటి సినిమాకు తేజను డైరెక్టర్ గా పెట్టుకోవడం పట్ల కొన్ని విమర్శలు వినిపించాయి. అయితే రానా తీసుకున్నది సరైన నిర్ణయమని సినిమా టీజర్, ట్రైలర్ నిరూపించింది. ట్రైలర్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.