HomeTelugu Trendingఅనుష్క 'నిశ్శబ్ధం' పోస్టర్‌ విడుదల

అనుష్క ‘నిశ్శబ్ధం’ పోస్టర్‌ విడుదల

9 19
స్టార్‌ హీరోయిన్‌ అనుష్క ‘భాగమతి’ హిట్‌ తర్వాత నటిస్తున్న చిత్రం ‘నిశ్శబ్ధం’. ఈ మూవీ టైటిల్‌ పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు. స్వీటీ చిత్ర పరిశ్రమకు వచ్చి 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఆమెకు యూనిట్‌ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్టర్‌లో అనుష్క చేతులు మాత్రమే చూపించారు. ఇందులో ఆమె దివ్యాంగురాలి పాత్రలో కనిపించనున్నట్లు తెలిసింది.

ఈ చిత్రానికి మంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హాలీవుడ్‌ స్టార్‌ మైఖెల్‌ మ్యాడసన్‌ కూడా నటిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవల ఈ సినిమాలో తన లుక్‌ను తెలుపుతూ అనుష్క ఓ స్టిల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తయింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu