నిత్య కూడా తగ్గుతానంటోంది!

నిన్నమొన్నటివరకు ముద్దుగా, బొద్దుగా ఉన్న హీరోయిన్స్ ఇప్పుడు తమ శరీర బరువును
తగ్గించుకుంటూ.. అందరికీ షాక్ ఇస్తున్నారు. అందాల బ్యూటీ హన్సిక ఇటీవలే డైట్ చేసి
బాగా సన్నబడింది. ఇప్పుడు నిత్యమీనన్ కూడా తగ్గుతానంటోంది. ప్రస్తుతం తన శరీర
బరువును తగ్గించుకునే పనిలో నిమగ్నమయ్యానని తెలిపింది. త్వరలోనే ఓ సినిమాలో
నటించబోతున్నాను. ఆ సినిమా కోసమే ఈ బరువు తగ్గే కార్యక్రమం. కఠినమైన ఆహార
నియమాలను పాటిస్తున్నాను. ఆ సినిమాతో అందరినీ సర్ప్రైజ్ చేస్తాను అని చెబుతోంది.
అయితే ఆ సినిమా వివరాలేవీ మాత్రం చెప్పలేదు. నిత్య బొద్దుగా ఉంటే ఇష్టపడేవారి సంఖ్య
చాలా ఎక్కువ. మరి ఈ నేపధ్యంలో అమ్మడు బరువు తగ్గడం తన అభిమానులకు నచ్చుతుందో..
లేదో.. చూడాలి!

CLICK HERE!! For the aha Latest Updates