రంభ కథ సుఖాంతమయింది!

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమయింది. ఇటీవల టీవీ షోల ద్వారా ప్రేక్షకులను మళ్ళీ పలకరిస్తోంది. దాదాపు ఏడేళ్ళ క్రితం రంభ, కెనడాకు చెందిన పారిశ్రామిక వేత్త ఇంద్రన్ ను వివాహం చేసుకొంది. కొన్నాళ్ళ పాటు ఇద్దరూ సంతోషంగానే ఉన్నారు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు మొదలవ్వడంతో రంభ చెన్నైకి వచ్చేసింది. ఇటీవల రంభ కోర్టులో పిల్లల పోషణ నిమిత్తం కొంత భరణం చెల్లించాలని, లేదంటే తన భర్త తనతోనే కలిసి జీవించాలని కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. 
 
దీనిపై స్పందిస్తూ కోర్టు ఇంద్రన్ కు నోటీసులు పంపింది. అతడి వాదన విన్న అనంతరం కోర్టు ఈ సమస్యను బయట పరిష్కరించుకుంటేనే మంచిదని సూచించింది. దీంతో రంభ, ఇంద్రన్ లు కలిసి జీవించాడానికే మొగ్గు చూపిస్తున్నారని సమాచారం. ఈ విషయాన్ని కోర్టుకి తెలుపగా ఇక ఆ కేసును కొట్టి వేసినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి తన భర్తను తనతో కలపాలని కోర్టుకి వెళ్ళిన రంభ కథ సుఖాంతమయింది.