HomeTelugu Trendingనితిన్‌ పెళ్ళి డేట్‌ ఫిక్స్‌..

నితిన్‌ పెళ్ళి డేట్‌ ఫిక్స్‌..

3
టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్‌-షాలిని నిశ్చితార్థం ఫిబ్రవరి లో జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దుబాయ్ లో ఏప్రిల్ నెలలో పెళ్లి అనుకున్నారు. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే కరోనా ప్రభావం ఇంకా తగ్గకపోయినా నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి మాత్రం తొందరగా ఈ వివాహం చేసేయాలని నిర్ణయించుకున్నారు. తాజా స‌మాచారం ప్రకారం నితిన్ పెళ్ళి ఈ నెల 26న ఫిక్స్‌ చేసినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం మళ్ళీ లాక్ డౌన్ విధించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో నితిన్ వివాహం ఏదైనా కళ్యాణ మంటపం, ఫార్మ్ హౌస్, ఇంటి దగ్గర లేదా హోటల్ లో అనేది మాత్రం ఇంకా నిర్ణయించలేదు. కానీ వివాహం జరిగే తేదీ మాత్రం నిర్ణయించారు. చూడాలి మరి పెళ్ళి ఎక్కడ జరుగుతుంది అనేది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu