సంపూర్ణేష్ బాబు సాంగ్‌ విడుదల.. వామ్మో ఇదేం కామెడీ రా.. బాబు

‘హృద‌య‌ కాలేయం’ సినిమాలో తన కామెడీతో పిచ్చెక్కించిన సంపూర్ణేష్ బాబు ఇప్పుడు అంతకు మించిన పిచ్చ కామెడీతో ‘ కొబ్బరి మట్ట’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రూపక్ రొనాల్డ్ సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా కొబ్బరిమట్ట సాంగ్ టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టెంట్స్ శివబాలాజీ, కత్తి కార్తీక, సమీర్, ముమైత్ ఖాన్, ధనరాజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తాజాగా విడుదలైన కొబ్బరిమట్ట నుండి కొబ్బరి ఆకు వీడియో సాంగ్.. బర్నింగ్ స్టార్ కామెడీ పీక్స్‌కు వెళ్తే ఎలా ఉంటుందో చెప్పకనే చెబుతోంది. “కొబ్బరి ఆకులు కలగలిపే కొబ్బరి మట్ట కథ.. రబ్బరు గాజుల చప్పుడులా కాదిది కట్టుకథ” అంటూ సాగే ఈ పాటలో ‘మన కుటుంబాన్ని విడదీసేది బ్రష్ అయినా సరే.. అది మనకు వద్దు.. ఐదు వేళ్లలాంటి మన ఐదుగురు అన్నదమ్ములకు ఐదు బ్రష్‌లు వద్దురా అంటూ ఒకటే బ్రష్‌తో ఐదుగురు పళ్లు తోముకోవడం.. ఎదిగిన తమ్ముళ్లను గేదెల్ని కడిగినట్టు గడ్డితో కడగటం ఒకఎత్తైతే.. మీసాలు గెడ్డాలు మొలిచి 30కి క్రాస్ అయిన ఓ తమ్ముడికి స్నానం చేయిస్తూ టవల్ విప్పిచూడటం.. పక్కనే ఉన్న పనివాడు తమ్ముడు చాలా ఎదిగిపోయాడయ్యా అనగానే.. నిజమేరా అంటూ బర్నింగ్ స్టార్ చూపు అటుగా వెళ్లడం బోల్డ్‌ కామెడీ పీక్స్ కి వెళ్లినట్టు ఉంది. ఈ సాంగ్‌ పై మీరూ..ఓ లుక్‌ వేయండి..