HomeTelugu Trendingవైష్ణవ్‌ తేజ్‌ కొత్త సినిమా ప్రారంభం

వైష్ణవ్‌ తేజ్‌ కొత్త సినిమా ప్రారంభం

Vaishnav tej new film shoot
టాలీవుడ్‌లో ‘ఉప్పెన’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు హీరో వైష్ణవ్‌ తేజ్‌. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. గిరీశాయ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. కేతికా శర్మ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ ‘‘ఉప్పెన’ లాంటి హిట్‌ తర్వాత వైష్ణవ్‌తో మా బ్యానర్‌లో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ‘అర్జున్‌ రెడ్డి’ తమిళ వెర్షన్‌ను తెరకెక్కించిన గిరీశాయ.. ఈ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. వైష్ణవ్‌ను కుటుంబ ప్రేక్షకులకు చేరువ చేసే మంచి కథతో.. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu