HomeTelugu Trending'విక్రమ్' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో 'మాచర్ల నియోజక వర్గం' ఫస్ట్‌ సాంగ్‌ విడుదల

‘విక్రమ్’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ‘మాచర్ల నియోజక వర్గం’ ఫస్ట్‌ సాంగ్‌ విడుదల

nithin Macherla niyojakavar

ప్రముఖ నటుడు కమల హాసన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘విక్రమ్’. కమల్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. జూన్ 3వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ సినిమాను హీరో నితిన్ తన సొంత బ్యానర్లో విడుదల చేస్తున్నాడు. తెలుగు వెర్షన్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ – శిల్పకళావేదికలో నిర్వహించనున్నారు.

ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా వెంకటేశ్ రానున్నారు. కమల్ .. వెంకీల మధ్య ‘ఈనాడు’ సినిమా నుంచి మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో కమల్ చేతుల మీదుగా నితిన్ ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమాకి సంబంధించిన ఫస్టు లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమాలో కృతి శెట్టి – కేథరిన్ హీరోయిన్‌లుగా అలరించనున్నారు. ఆగస్టు 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu