HomeTelugu NewsRobinhood: బాలీవుడ్‌ నటుడితో నితిన్‌ వార్‌ తట్టుకోగలడా?

Robinhood: బాలీవుడ్‌ నటుడితో నితిన్‌ వార్‌ తట్టుకోగలడా?

Nithin RobinhoodRobinhood: టాలీవుడ్ హీరో నితిన్ – వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం రాబిన్‌హుడ్‌. భీష్మ తరువాత వీరిద్దరి కాంబినేష‌న్‌లో ఈ సినిమా వ‌స్తుండ‌టంతో ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతుంది.

నితిన్ ఈ సినిమాలో దొంగగా కనిపించబోతున్నాడు. రాజేంద్రప్రసాద్‌, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి వచ్చిన గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ క్రమంలో ఈ సినిమా గురించిన ఓ ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీలో బాలీవుడ్ న‌టుడు సంజ‌య్‌ద‌త్ కీల‌కపాత్రలో న‌టిస్తున్న‌ట్లు టాక్‌. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

కెజిఎఫ్ 2, లియో చిత్రాలతో సంజయ్‌దత్ సౌత్‌లో సంచలనంగా మారారు. పూరీ జగన్నాధ్ డైరెక్షన్‌లో వస్తున్న డబుల్ ఇస్మార్ట్‌లో సంజయ్‌దత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నితిన్ రాబిన్‌హుడ్‌లో కూడా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదే కనుక నిజమైతే నితిన్ చిత్రానికి ఎక్స్‌ట్రా మైలేజి వచ్చినట్లే అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదట రష్మికను అనుకున్నారు. కానీ ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, రవి శంకర్‌ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్‌ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu