బిగ్‌బాస్‌ హౌస్‌లో కిర్రాక్‌ పార్టీ.. డాన్స్‌లతో ఊపేసిన ఇంటి సభ్యులు

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 ఫినాలేకి ఒక్క అడుగు దూరంలో ఉంది. మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనే సస్పెన్స్‌కు తెరపడనుంది. తనీష్, కౌశల్, దీప్తి, గీతా మాధురి, సామ్రాట్‌లు ఫైనల్ పోరులో తలపడుతుండగా ఆల్ రెడీ ఎలిమినేట్ అయిన కంటెంస్టెంట్స్‌లో ఒక్క నూతన్ నాయుడు మిగిలిన అందరూ ఫ్యామిలీ పార్టీలో భాగంగా బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేస్తున్నారు. ఇక ఈ రోజు (శనివారం) ఎపిసోడ్ 112 హైలైట్స్ విషయానికి వస్తే.. అసలు సిసలు ఎంటర్‌టైన్‌మెంట్‌‌ను ఫ్యామిలీ ఫ్యాక్‌గా బిగ్ బాస్ ఫ్యామిలీ పార్టీలో అందించారు. నిన్నటి వరకూ కేవలం ఐదుగురు ఫైనల్ కంటెస్టెంట్స్‌తో బోసిపోయిన బిగ్ బాస్ హౌస్‌కి ఎలిమినేట్ కంటెస్టెంట్స్ సభ్యులు అందరూ.. హౌస్‌లో ఎంట్రీ ఇవ్వడంతో హౌస్‌ మొత్తం సందడిగా మారింది. 17 మంది కలిసి ఫుల్ జోష్‌లో పార్టీని ఎంజాయ్ చేశారు. ఈ పార్టీని మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ‘యాపీ ఫిజ్ అవార్డ్ షో పార్టీ’ అనే ఎనర్జిటిక్ షోను ఏర్పాటు చేశారు బిగ్ బాస్. ఈ షోకి రోల్ రైడా, అమిత్‌లను హోస్ట్‌లుగా నియమిస్తూ… మిగిలిన కంటెస్టెంట్స్ అందరికీ కలర్ ఫుల్ డ్రెస్‌లు అందించి పార్టీ వాతావరణం కనిపించే విధంగా హౌస్‌ను అలకరించారు.

ఇక ఈ గ్రాండ్ పార్టీలో భాగంగా మొదటిగా ఫినాలే కంటెస్టెంట్ సింగర్ గీతా మాధురి పాటల కచేరి ఉంటుందంటుందని మైక్‌ను ఆమెకు అందించడంతో వరుస పాటలతో బిగ్ బాస్ హౌస్‌నూ ఓ ఊపు ఊపేసింది గీతా. ‘గబ్బర్ సింగ్‌కి లైనేశా.. నీటిలోన చేప వచ్చి.. మెలికలు తిరుగుతుంటె అమ్మాయో.. టాప్ లేచిపోద్ది.. ఇలా వరుస సాంగ్‌లను పాడుతూ.. కంటెస్టెంట్స్‌తో డాన్స్‌లు చేయించింది. 15 నిమిషాలు పాటు తన పాటల ప్రవాహంతో అటు ప్రేక్షకుల్ని ఇటు బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌లకు తన గాన మాధుర్యాన్ని అందించింది. ఆమె పాటలు పాడుతుంటే మిగిలిన కంటెస్టెంట్స్ డాన్స్‌లతో రెచ్చిపోయారు. ‘ మెలికలు తిరుగుతుంటె అమ్మాయో.. ‘ సాంగ్‌కి భాను శ్రీ మెలికలు తిరిగే స్టెప్‌లో అదరగొట్టేసింది. ఓవరాల్‌గా బిగ్ బాస్ హౌస్‌కి వచ్చిన ఇన్నాళ్లలలో గీతా మాధురి ది బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చింది.

ఫస్ట్ ర్యాపిడ్ క్వచ్ఛన్స్‌ ఇంట్రస్టింగ్ ఆన్సర్స్ భాగంగా.. ఫ్యామిలీ పార్టీలో భాగంగా హోస్ట్‌లు రోల్ రైడా, అమిత్‌‌లు మిగిలిన కంటెస్టెంట్స్‌ను ర్యాపిక్ క్వచ్ఛన్స్ అడిగారు. ప్రశ్న- సమాధానాలు ఏంటో చూద్దాం.
*కౌశల్.. మీకు బిగ్ బాస్ హౌస్‌లో ప్రేరణ ఎవరు? .. నాకు నేనే ప్రేరణ నాకు ప్రేరణ కలిగించే వ్యక్తులు ఎవరూ బిగ్ బాస్ హౌస్‌లో కనిపించలేదు.
*గీతా మాధురి.. మీకు సీక్రెట్ టాస్క్.. కెప్టెన్ టాస్క్‌లలో ఏది ఇష్టం? ..సీక్రెట్ టాస్క్.
*సామ్రాట్.. మీరు తేజస్వి, గీతా మాధురిలో ఒకర్ని ఎంచుకోమంటే..? .. తేజస్వి
*బాబు గోగినేని గారు.. బిగ్ బాస్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే..? .. అతనో నార్త్ కొరియా డిక్టేటర్..
*పూజా రామ చంద్రన్.. బిగ్ బాస్ విన్నర్ ఎవరు కావొచ్చు? .. తనీష్ లేదా కౌశల్. అంటూ.. ఆసక్తిరమైన జవాబులు ఇచ్చారు