HomeTelugu Trendingకీర్తి సురేష్‌తో నితిన్‌ 'రంగ్‌దే'

కీర్తి సురేష్‌తో నితిన్‌ ‘రంగ్‌దే’

5 22యంగ్‌ హీరో నితిన్‌ ఓ వైపు భీష్మ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు.. నిన్ననే మరో చిత్రానికి కొబ్బరికాయ కొట్టేశాడు.. నేడు మరో చిత్రాన్ని అనౌన్స్‌ చేసేశాడు‌. వరుస చిత్రాలతో బిజీ బిజీగా ఉన్న ఈ హీరో. కాగా ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ నితిన్‌కు జోడిగా నటించానున్నారు. తాజాగా ఈ కొత్త చిత్ర విశేషాలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నాడు.

వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించగా.. చంద్రశేఖర్‌ యేలేటి డైరెక్షన్‌లో మరో సినిమాను ఆదివారం ప్రారంభించాడు నితిన్‌. తాజాగా వెంకీ అట్లూరితో కలిసి చేయబోయే కొత్త సినిమా కబుర్లను అభిమానులతో పంచుకున్నాడు. ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటించనుందని, ఈ సినిమాకు రంగ్‌దే అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్లు తెలిపాడు. ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగవంశీ నిర్మించగా.. సినిమాటోగ్రఫర్‌గా పీసీ శ్రీరామ్‌ పనిచేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu