HomeTelugu Trendingఆర్‌ఆర్‌ఆర్‌లో గిరిజన యువతిగా నిత్యామీనన్..!

ఆర్‌ఆర్‌ఆర్‌లో గిరిజన యువతిగా నిత్యామీనన్..!

11 26

రామ్ చరణ్‌కు గాయం కారణంగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ కు కొద్దిగా గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే తిరిగి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త చక్కర్లు కొడుతోంది. కథ ప్రకారం అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్న రామ్ చరణ్ కు జోడిగా అలియా భట్ నటిస్తుంటే… కొమరం భీం పాత్ర చేస్తున్న ఎన్టీఆర్ కు జోడిగా మొదట విదేశీ భామ డైసీ ని ఎంపిక చేశారు. కొన్ని కారణాల వలన డైసీ ఈ సినిమా నుంచి తప్పుకుంది.

డైసీ తరువాత ఆ పాత్ర కోసం రాజమౌళి అనేకమంది పేర్లను పరిశీలించారు. నిత్యా మీనన్ ను కూడా స్క్రీన్ టెస్ట్ చేసి ఆమెను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇందులో నిత్యా మీనన్ చేస్తున్న పాత్ర ఏమిటనేదానిపై క్లారిటీ వచ్చింది. కొమరం భీం ను ఆరాధించే గిరిజన యువతి పాత్రలో నిత్యా మీనన్ నటిస్తోందట. కథ ప్రకారం కొమరం భీం కు ముగ్గురు భార్యలు ఉండగా అందులో ఒకరిగా నిత్యా మీనన్ కనిపిస్తోందని సమాచారం. విదేశీ యువతి పాత్రలో ఎవరు నటిస్తున్నారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu