డిజె బెనిఫిట్ షోల సంగతేంటి..?

స్టార్ హీరో సినిమా విడుదలవుతుందంటే బెనిఫిట్ షో లు పక్కా ఉండాల్సిందే. అయితే గత కొంతకాలంగా కొన్ని సినిమాలకు పోలీస్ పర్మిషన్ దొరకక బెనిఫిట్ షోలు పడకపోతే.. మరికొందరు స్టార్స్ బెనిఫిట్ షో అంటేనే భయపడుతున్నారు. అర్ధరాత్రి షో వేయడం ద్వారా కొందరు కావాలని సినిమా మీద నెగెటివ్ ప్రచారం చేయడం మొదలుపెడుతున్నారు. దీనివలన సినిమా ఓపెనింగ్స్ మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో కొందరు హీరోలు బెనిఫిట్ షోలంటే ససేమీర అంటున్నారు. ఇప్పుడు
అల్లు అర్జున్ పరిస్థితి కూడా అంతే..

సరైనోడు సినిమా సమయంలో బన్నీ బెనిఫిట్ షోలకు అంగీకరించలేదు. ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తోన్న ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా విషయంలో కూడా అదే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అభిమానుల నుండి ఆయనకు ఒత్తిడి ఎదురవుతున్నా.. బన్నీ మాత్రం అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. నైజాంలో బెనిఫిట్ షోలు దాదాపు లేనట్లే.. ఇక మిగిలిన ఏరియాల్లో కూడా తెల్లవారుజామున ఆరు గంటల నుండి షోలు పడే అవకాశాలు ఉన్నాయి.