HomeTelugu Newsనోయల్‌ 'సమయం లేదు మిత్రమా'

నోయల్‌ ‘సమయం లేదు మిత్రమా’

‘సమయం లేదు మిత్రమా’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నోయల్‌ హీరో. ట్వింకిల్‌ సౌజ్‌ హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. ఎమ్‌. వరప్రసాద్‌ దర్శకత్వంలో కె.వి.ప్రొడక్షన్‌ బ్యానర్‌లో జీఎమ్‌ మురళీధర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఎమ్‌. వరప్రసాద్‌ మాట్లాడుతూ ‘కామెడీ, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న చిత్రమిది.

1 18

ఈ చిత్రానికి చాలా మంచి టెక్నీషియన్లు కుదిరారు’ అన్నారు. ‘ఇది నా మొదటి చిత్రం. వరప్రసాద్‌ చెప్పిన కథ, కథనం నచ్చడంతో సినిమా నిర్మించడానికి ముందుకొచ్చాం’ అని జీఎమ్‌ మురళీధర్‌ అన్నారు. ‘ఈ చిత్రంలో చాలా మంచి పాత్ర చేస్తున్నాను. ఈ సినిమా నాకు చాలా ప్లస్‌ అవుతుంది’ అన్నారు నోయల్‌. ‘స్టోరీ బాగా కుదిరింది. తప్పకుండా అందరికీ నచ్చేలా ఈ చిత్రం నిర్మిస్తాం’ అన్నారు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ మాంచాల కిషన్‌. నటుడు నగేష్‌ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: చల్లా మహేష్, అశోక్‌గౌడ్, సంగీతం: అజయ్‌పట్నాయక్, కెమెరా: ప్రవీణ్‌ కె.కావళి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu