HomeTelugu Newsమహిళా రిపోర్టర్‌కు క్షమాపణలు చెప్పిన దుల్కర్‌ సల్మాన్‌

మహిళా రిపోర్టర్‌కు క్షమాపణలు చెప్పిన దుల్కర్‌ సల్మాన్‌

13 14
మాలీవుడ్‌ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌ నిర్మాతగా మారి తీసిన తొలి సినిమా ‘వరనే అవశ్యముంద్‌’. కల్యాణి ప్రియదర్శన్‌, శోభనా కీలక పాత్రలు పోషించారు. అనూప్‌ సత్యన్‌ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలోని ప్రకటన సన్నివేశంలో ముంబయికి చెందిన రిపోర్టర్‌ ఫొటోను ఉపయోగించారు. దీంతో సినిమాపై వివాదం మొదలైంది. సదరు మహిళా రిపోర్టర్‌ ట్వటర్‌లో స్పందిస్తూ.. దర్శక, నిర్మాతల్ని విమర్శించారు. తన అనుమతి లేకుండా ఫొటో వాడటంపై మండిపడ్డారు. పబ్లిక్‌లో బాడీ-షేమింగ్‌ చేశారని, దుల్కర్‌ క్షమాపణలు చెప్పాలని ఆరోపించారు.

దీన్ని చూసిన దుల్కర్‌ ఆమెకు సారీ చెప్పారు. ‘ఇది మా వైపు నుంచి జరిగిన తప్పే.. దీని బాధ్యత పూర్తిగా మేమే వహిస్తాం. మీ ఫొటోల్ని సినిమాలోని సన్నివేశానికి ఎందుకు ఉపయోగించారో సంబంధిత డిపార్ట్‌మెంట్‌ను అడిగి తెలుసుకుంటాం. మా వల్ల మీరు ఇబ్బందిపడ్డందుకు నా తరఫున, చిత్ర బృందం తరఫున క్షమాపణలు కోరుతున్నా. ఇది కావాలని చేసిన పని మాత్రం కాదు’ అని ఆయన ట్వీట్‌ చేశారు. అదేవిధంగా దర్శకుడు అనూస్‌ సత్యన్‌ కూడా రిపోర్టక్‌కు వివరణ ఇచ్చారు. ‘మీకు అసౌకర్యం కల్గించినందుకు సారీ. మహిళల్ని కించపరచడం, ఇబ్బందిపెట్టడం మా ఉద్దేశం కాదు. ఈ సినిమా కథే సెక్సిజంకు వ్యతిరేకంగా ఉంటుంది. చిత్ర సాంకేతిక బృందం తరఫున క్షమాపణలు చెబుతున్నా’ అని పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu