HomeTelugu Big Storiesబాలయ్యను ఢీకొట్టనున్నబాలీవుడ్‌ బ్యూటీ!

బాలయ్యను ఢీకొట్టనున్నబాలీవుడ్‌ బ్యూటీ!

 

diva nora fatehi 1

నందమూరి బాలకృష్ణ అటు హీరోగా.. ఇటు హోస్ట్‌గా ఫుల్‌ జోష్‌ లో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కామెడీ, ఫ్యామిలీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనిల్.. బాలయ్యతో అదే తరహాలో కామెడి, మాస్ మూవీ ప్లాన్ చేశాడు.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాలో బాలయ్య తన 3 డిఫెరెంట్‌ పాత్రల్లో కనిపించనున్నట్లు టాక్. యంగ్‌ బ్యూటీ శ్రీలీల ఆయన కూతురు గా కనిపించనుంది. ఇక బాలయ్యకు జోడీగా కాజల్‌ అగర్వాల్‌ నటించనుంది. షైన్‌ స్క్రీన్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నాడు.

Bollywood diva nora fatehi

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ నటిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. చిత్రంలో బాలయ్యతో ఢీ కొట్టే విలన్‌గా బాలీవుడ్‌ బ్యూటీ నోరా ఫతేహి నటిస్తున్నట్లు సమాచారం. గతంలో నోరా ‘బాహుబలి’ సినిమాలో ‘మనోహరి’ పాటలో నర్తించింది. అనిల్ చెప్పిన కథకు నోరా అంగీకరించినట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలో నోరా పాత్ర చాలా భయంకరంగా ఉంటుంది. బాలయ్యకు ఆమెకు మధ్య అనిల్ భారీ ఫైట్ సీన్ కూడా రాసినట్టు టాలీవుడ్ టాక్‌. ఈ ఫైట్ సీన్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందన్న టాక్‌ వినిపిస్తోంది. కాగా, ఈ చిత్రాన్ని త్వరలోనే సెట్స్ పైకి వెల్లనుంది.

అంతేకాక ఈ సినిమా షూట్‌ను ఏకధాటిగా జరిపి ఉగాదికి ఫస్ట్ లుక్‌ను విడుదలచేయనున్నారట. అంతేకాదు అదే రోజున ఈ సినిమా టైటిల్‌ను కూడా ప్రకటించనుందని తెలుస్తోంది. పాన్‌ ఇండియా రానున్న ఈ సినిమా ఆరు భాషల్లో విడుదలకానుందని సమాచారం.

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu