HomeTelugu Trendingబాలీవుడ్‌ ఎంట్రీపై ఎన్టీఆర్‌ కామెంట్స్‌

బాలీవుడ్‌ ఎంట్రీపై ఎన్టీఆర్‌ కామెంట్స్‌

ntr

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు రామ్‌చరణ్‌-ఎన్టీఆర్‌లు నటిస్తున్న మల్టీస్టారర్‌ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఎస్‌.ఎస్‌. రాజమౌళి డైరెక్షన్‌లో వస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రం జనవరి 7న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రచారాన్ని వేగవంతం చేసింది. హిందీ వెర్షన్‌ కోసం ఇటీవల ముంబయిలో ప్రి-రిలీజ్‌ వేడుకను ఘనంగా నిర్వహించింది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ పలు మీడియా సమావేశాల్లో పాల్గొంటూ విలేకర్ల ప్రశ్నలకు జవాబులిస్తున్నారు. ఈ క్రమంలో తన బాలీవుడ్‌ ఎంట్రీపై ఎన్టీఆర్‌ ఆసక్తికరమైన విషయం చెప్పారు.

ఓ విలేకరి.. నేరుగా బాలీవుడ్‌ సినిమాలో ఎప్పుడు నటిస్తారు? అని ప్రశ్నించగా.. తాను బాలీవుడ్‌ సినిమా అవకాశాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా విడుదలైన తర్వాత పరిస్థితులు మారి అవకాశాలు రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ‘ఆర్‌ఆర్‌ఆర్’ లోని మరో హీరో రామ్‌ చరణ్‌ ఎనిమిదేళ్ల కిందటే ‘జంజీర్’ చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. కానీ, ఆ సినిమా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌, అజయ్‌దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని, రేయ్‌ స్టీవ్‌సన్‌, ఎలిసన్‌ డ్యూడీ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కీరవాణి సంగీతం అందించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య ఈచిత్రాన్ని నిర్మించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu