HomeTelugu Trendingఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ల మధ్య ఘర్షణ.. కారణం ఇదే..!

ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ల మధ్య ఘర్షణ.. కారణం ఇదే..!

1 10
యంగ్‌ టైరగ్‌ ఎన్టీఆర్, మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ హీరోలుగా చేస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఇప్పటికే మేజర్‌ షూటింగ్ పూర్తి చేసుకుంది. మిగతా షూటింగ్ కూడా త్వరలోనే పూర్తి అవుతుందని అంటున్నారు. స్వతంత్రం కోసం పోరాటం చేసిన ఇద్దరు మన్యం వీరుల కథ ఇది. కొమరం భీంగా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లు కనిపిస్తున్నారు. ఈ ఇద్దరు కలిసి పోరాటం చేసినట్టుగా చరిత్రలో ఎక్కడా కనిపించలేదు.

కానీ, ఈ సినిమాను రాజమౌళి ఒక ఫిక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. అలాంటి వీరులు కలిసి పోరాటం చేస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్నీ ఆదారంగా చేసుకొని దాని చుట్టూ కథను అల్లి సినిమా తీస్తున్నారు. ఈ కల్పిత కథలో ఎన్టీఆర్… రామ్ చరణ్ కు సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయట. వీరిద్దరి మధ్య జరిగే ఫైట్ ను ఇటీవలే షూట్ చేసినట్టుగా సమాచారం. ఇందులో రామ్ చరణ్ కొన్ని చోట్ల ఎన్టీఆర్ బీట్ చేశారని సమాచారం. ఈ ఫైట్ చిత్రానికే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఈ విషయం బయటకు రావడంతో మరింత ఆసక్తి పెరిగింది. వచ్చే ఏడాది జనవరి 8 న సినిమా విడుదల కాబోతున్నది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu