మెగా బ్యానర్‌లో నిఖిల్‌ ప్యాన్‌ ఇండియా మూవీ

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్దార్థ్ కార్తికేయ-2తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా మరో భారీ చిత్రానికి ఒకే చెప్పాడు. ఈ చిత్రానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. తన స్నేహితుడు విక్రమ్ రెడ్డితో కలిసి వీ మెగా పిక్చర్స్ అనే ప్రొడక్షన్ కంపెనీని చరణ్ ప్రారంభించారు.

ఈ బ్యానర్ లో మొదటి చిత్రంగా అభిషేస్ అగర్వాల్ ఆర్ట్స్ తో కలిసి ది ఇండియన్ హౌస్ అనే మూవీ ని ప్రారంభించారు. ఈ సినిమాలో నిఖిల్ సిద్ధార్ద్ లీడ్ రోల్ చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ కి సంబందించిన మోషన్ టైటిల్ ఫస్ట్ లుక్ ప్రోమోని లాంచ్ చేశారు.

రామ్ వంశీ కృష్ణా ఈ మూవీ తో దర్శకుడి గా పరిచయం అవుతున్నారు. అలాగే నిఖిల్ తో పాటు బాలీవుడ్ స్టార్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. భారత చరిత్రలో మరిచిపోయిన అధ్యాయం. 1905లో లండన్ రివల్యూషన్ లో ఒక ప్రేమ కథని ఈ మూవీ లో చూపించబోతున్నారు. నిఖిల్ సిద్ధార్ద్ శివ అనే పాత్రలో నటిస్తున్నాడు.

ఈ మోషన్ విజువల్ చూస్తూ ఉంటే రియల్ లైఫ్ సంఘటనల స్ఫూర్తి తో తెరకెక్కిన ఒక హీరో కథగా ఈ మూవీ ఉండబోతోంది అని తెలుస్తోంది. ఇక ది ఇండియా హౌస్ టైటిల్ క్రింద జై మాతా జి అనే క్యాప్షన్ ఇచ్చారు. దీనిని బట్టి ఈ కాన్సెప్ట్ లో రిలీజియన్ ఎలిమెంట్స్ ని టచ్ చేయబోతున్నారని అర్ధమవుతోంది.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates