HomeTelugu Big Storiesఎన్టీఆర్‌ భరతనాట్యం వీడియో.. వైరల్‌

ఎన్టీఆర్‌ భరతనాట్యం వీడియో.. వైరల్‌

1 1
టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలెంటెడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ నటుడు మాత్రమే కాదు అద్భుతమైన డాన్సర్ కూడా. ఇంకా భరతనాట్యంలో కూడా శిక్షణ పొంది నాట్య ప్రదర్శన చేసిన ఘనత ఆయనకు ఉంది. చిన్నప్పటి నుంచే క్లాసికల్ డాన్స్‌లో శిక్షణ తీసుకున్నాడు ఎన్టీఆర్. అందుకే ప్రస్తుతం సినిమాలలో ఎలాంటి డాన్సులు అయినా అవలీలగా చేసేస్తాడు. కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ డాన్సర్స్లో ఎన్టీఆర్ కూడా ఒకడని అంటున్నారంటే అతని టాలెంట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

అంతెందుకు స్వయంగా స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా ఓ సమయంలో జూనియర్ డాన్స్ గురించి ప్రస్తావించాడం విశేషం. చిన్ననాటి నుంచి కూడా డాన్స్ అంటే ఎన్టీఆర్‌కు ఉన్న ఆసక్తిని గమనించి తల్లి శాలిని కొడుకుకు డాన్స్ ట్రైనింగ్ ఇప్పించింది.‌అలా చిన్నపుడే డాన్స్ నేర్చుకుంటూ స్టేజి షోలలో ప్రదర్శనలు కూడా ఇచ్చాడు. ఆ సమయంలోనే ఎన్నో బహుమతులు కూడా అందుకున్నాడట. ఇక తాజాగా ఎన్టీఆర్ టీనేజ్ లో ఉన్నపుడు చేసిన భరతనాట్యం పర్ఫార్మెన్స్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా బాగా వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ నాట్యానికి బహుమతులు కూడా బాగానే వచ్చాయట.

ఆ వీడియోలో భరతనాట్యం చేస్తూ తనలోని మెళుకువలు చూపించాడు జూనియర్ ఎన్టీఆర్. తొలి సినిమా బాల రామాయణం కంటే ముందు ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడట. ఆ తర్వాత బాల రామాయణం చేసి.. నిన్ను చూడాలని సినిమాతో హీరోగా పరిచయం ఏంట్రీ ఇచ్చాడు. ఇక వినాయక్ దర్శకత్వంలో ఆది సినిమా చేసి ఫస్ట్ బ్లాక్ బస్టర్ రుచి చూసాడు. ఆ తర్వాత సింహాద్రితో సూపర్ స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బీజీగా ఉన్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu