HomeTelugu Big Storiesఎన్టీఆర్‌ హాలీవుడ్‌ ఎంట్రీ ప్రముఖ సంస్థతో!

ఎన్టీఆర్‌ హాలీవుడ్‌ ఎంట్రీ ప్రముఖ సంస్థతో!

ntr hollywood entry with ma
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ హాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఐరన్ మ్యాన్, ది అవెంజర్స్, కెప్టెన్ అమెరికా వంటి ప్రఖ్యాత సూపర్ హీరో చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చిన ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ మార్వెల్ స్టూడియో(మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌)తో కలిసి పనిచేసే అదృష్టం తారక్ ను వరించేలా ఉంది అంటున్నారు. ఎన్టీఆర్, చరణ్ నటించిన ఆర్ఆర్ ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఇటీవల గోల్డెన్ గ్లోబ్ పురస్కారం లభించింది. అవార్డును అందుకునేందుకు అమెరికా లాస్ఏంజెల్స్ కు చిత్రబృందంతో కలిసి వెళ్లిన ఎన్టీఆర్.. అక్కడి మీడియాతో సంభాషించారు. అమెరికన్ యాక్సెంట్లో ఎన్టీఆర్ అనర్గళంగా మాట్లాడి ఆకట్టుకున్నారు.

ఈ క్రమంలో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగం కావడానికి తన ఆసక్తిని వ్యక్తం చేశారు. వెంటనే మార్వెల్ స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ విక్టోరియా అలోన్సోని ఎన్టీఆర్ కలుసుకోవడంతో దానికి పునాది పడినట్లు కనిపిస్తోంది. గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల ప్రదానం తర్వాత జరిగిన పార్టీలో ఒక అమెరికన్ జర్నలిస్ట్ విక్టోరియా అలోన్సోకి ఎన్టీఆర్ ని పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఈ ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తాను మార్వెల్ చిత్రంలో భాగం కావాలనుకుంటున్నట్లు వెల్లడించారు. మార్వెల్ రూపొందించిన చిత్రాల్లో టోనీ స్టార్క్ తన అభిమాన పాత్ర అని ఎన్టీఆర్ చెప్పారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!