HomeTelugu TrendingJr NTR డ్రాగన్ సినిమాలో అదే హైలైట్..!

Jr NTR డ్రాగన్ సినిమాలో అదే హైలైట్..!

Jr NTR and Prashanth Neel

Jr NTR  Dragon:

కేజీఎఫ్ 2, సలార్ సినిమాలతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి ఓ భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ‘డ్రాగన్’ అనే టైటిల్‌తో రూపొందుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతున్నారు. ప్రశాంత్ నీల్ మార్క్‌కు తగినట్లుగా డార్క్ థీమ్ యాక్షన్ డ్రామాగా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్‌పై చిత్రీకరిస్తున్న ఒక భారీ హైవోల్టేజ్ యాక్షన్ సీన్‌పై ఇండస్ట్రీలో భారీ చర్చ జరుగుతోంది. ఈ సన్నివేశాన్ని చిత్రీకరించేందుకు ఓ భారీ పోలీస్‌ స్టేషన్ సెట్‌ను ప్రత్యేకంగా వేసినట్టు సమాచారం. ఇక ఈ సీక్వెన్స్ మొత్తం సినిమాలో హైలెట్గా నిలవనంత.

ఈ యాక్షన్ సీన్‌లో ఎన్టీఆర్ బీస్ట్ అవతారంలో కనిపించి ప్రేక్షకులను అలరించనున్నారని టాక్. ఈ సీన్‌ను చిత్రీకరించేందుకు 500 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. అల్లర్లతో నిండిన బ్యాక్‌డ్రాప్‌లో ఎన్టీఆర్ చేసే యాక్షన్ విన్యాసాలు ప్రేక్షకులకు ఓ మ‌రుపురాని అనుభూతిని కలిగించనున్నాయంటున్నారు.

ఈ చిత్రంలో కన్నడ నటి రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించగా, మలయాళ నటుడు తవినో థామస్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, టి-సిరీస్ సంస్థలు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా భాగస్వామిగా ఉన్నది.

ఈ పాన్ ఇండియా చిత్రం 2026 జూన్ 25న గ్రాండ్ రిలీజ్ కానుంది. ‘డ్రాగన్’ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుందని సినీ వర్గాలు అంటున్నాయి.

ALSO READ: Mangli పుట్టినరోజు వేడుకలో జరిగిన గంజాయి కలకలం ఏమిటంటే..?

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!