
Ram charan- Nikhil accident:
రామ్ చరణ్ సమర్పణలో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా సినిమా ది ఇండియా హౌస్ షూటింగ్ సందర్భంగా అనుకోని ఘటన చోటు చేసుకుంది. హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ వంశీకృష్ణ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు వి మెగా పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.
ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ శంషాబాద్ సమీపంలో జరుగుతుండగా, సముద్ర సన్నివేశాల కోసం ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా పగిలిపోవడంతో భారీగా నీరు బయటికొచ్చి సెట్‌ను ముంచెత్తింది. ఈ ఘటనలో పలువురు సిబ్బందికి గాయాలు కాగా, కొన్ని షూటింగ్ పరికరాలు కూడా దెబ్బతిన్నాయి. గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించబడినట్లు సమాచారం. అసిస్టెంట్ కెమెరామెన్‌కు తీవ్రమైన గాయాలవచ్చాయని తెలిసింది. ప్రస్తుతం షూటింగ్ తాత్కాలికంగా ఆపేశారు.
Accident in the sets of Nikhil film produced by RamCharan
An accident occurred during the shoot of Tollywood young hero Nikhil’s upcoming film The Indian House, which also involves Ram Charan as a producer.
A massive water tank, set up near Shamshabad to shoot ocean scenes,… pic.twitter.com/2XOurdPNhT
— India Brains (@indiabrains) June 12, 2025
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా, చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. 1905 నేపథ్యంలో స్వాతంత్య్రోద్యమం, ప్రేమ కలగలిపిన కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో నిఖిల్ సరసన సయీ మంజ్రేకర్ నటిస్తున్నారు. అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఈ చిత్రం 2025లో విడుదలయ్యే అవకాశాలు ఉండగా, నిఖిల్ కెరీర్‌కు ఇది ఓ మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు. మరోవైపు రామ్ చరణ్ తన తదుపరి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.
ALSO READ: mangli పుట్టినరోజు వేడుకలో జరిగిన గంజాయి కలకలం ఏమిటంటే..?