
Mangli’s birthday party:
జానపద, సినీ గాయని మంగ్లీ పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. తాజాగా ఆమె పుట్టినరోజు వేడుకల నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన వివరాలు చర్చనీయాంశంగా మారాయి. మంగ్లీ బర్త్‌డే పార్టీ మంగళవారం రాత్రి హైదరాబాద్ శివార్లలోని ఈర్లపల్లిలో ఉన్న ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో నిర్వహించబడింది.
అయితే, ఈ పార్టీలో గంజాయి వినియోగం, విదేశీ మద్యం సరఫరా జరిగినట్లు సమాచారం రావడంతో, పోలీసులు అక్కడ హుటాహుటిన దాడి చేశారు. దాడిలో అనుమతి లేని మద్యం బాటిళ్లు మరియు కొంతమంది వద్ద గంజాయి కూడా లభించాయి. దీంతో మంగ్లీతో పాటు రిసార్ట్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
View this post on Instagram
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ పార్టీకి దాదాపు 50 మంది హాజరయ్యారు. వీరిలో తొమ్మిది మంది మత్తు పరీక్షలో పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. అందులో కొంతమంది సినిమా ఇండస్ట్రీకి చెందినవారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కేసు ప్రస్తుతం ఎన్డీపీఎస్ చట్టం కింద దర్యాప్తులో ఉంది.
ఇప్పటికే రాజకీయ అభిప్రాయాల కారణంగా మంగ్లీ కొన్నిసార్లు విమర్శలు ఎదుర్కొన్నారు. ఇటీవల అరసవల్లి ఆలయంలో ఆమెకు జరిగిన ప్రత్యేక సేవల నేపథ్యంలో టీడీపీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, వైసీపీకి మద్దతుగా ఆమె వ్యవహరిస్తుందన్న విమర్శలు కూడా వచ్చాయి. ఈ విషయంలో ఆమె స్పష్టతనిచ్చేందుకు ఒక మీడియా ప్రకటన కూడా ఇచ్చారు.
ఇక ఇప్పుడు ఈ గంజాయి వివాదంతో మంగ్లీ మరొకసారి విమర్శల మధ్యలో నిలిచారు. ఆమెపై ముద్రపడ్డ రాజకీయ అనుబంధాల కంటే, ఈ కేసు ఎలా పరిణామం చెందుతుందన్నదే ప్రధాన ప్రశ్నగా మారింది.
ALSO READ: చెట్టు వెనక బట్టలు మార్చుకోమన్నారు.. Star Herione కీలక వ్యాఖ్యలు..!