లవర్ బాయ్ గా తారక్!

ఇటీవల ‘జై లవకుశ’ చిత్రంతో సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడు.  త్రివిక్రం తో మొదటి సారి సినిమా చేస్తున్న తారక్ సినిమాపై ఎంతో ఎక్సయిటింగ్ గా ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో తారక్ లవర్ బోయ్ గా కనిపిస్తాడని అంటున్నారు. ఎన్టీఆర్ ను లవర్ బోయ్ గా అంటే ఊహించుకుంటేనే కొత్తగా ఉంది. అయితే త్రివిక్రం డైరక్షన్ లో ఫ్యాన్స్ కు ఈ సర్ ప్రైజ్ ఇవ్వనున్నారట.

ఇక ఈ సినిమా కోసం తారక్ కొత్త లుక్ ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. కచ్చితంగా ఇది ఎన్టీఆర్ కెరియర్ లో ఓ సెపరేట్ సినిమాగా ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం యూరప్ ట్రిప్ లో ఉన్న తారక్ అది ముగించుకుని వచ్చాక త్రివిక్రం సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తాడట. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలిసిందే.