డేట్‌ కన్ఫర్మ్ చేసుకున్న ఎన్టీఆర్ మహానాయకుడు!

నందమూరి బాలకృష్ణ ‘ఎన్టీఆర్’ బయోపిక్‌ను రెండు భాగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకటి సినిమా రంగం గురించి వివరించే ఎన్టీఆర్ ‘కథానాయకుడు’, రెండో సినిమా ఎన్టీఆర్ ‘మహానాయకుడు’. కథానాయకుడు జనవరి 9 న విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా పరంగా పెద్దగా నిలబడలేకపోయింది. భారీ కలెక్షన్లు వస్తాయి అనుకుంటే.. అనూహ్యంగా నష్టాలను మూటగట్టుకుంది.

ఇప్పుడు ఎన్టీఆర్ రాజకీయ రంగం గురించి తీసిన మహానాయకుడు సినిమా రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమా ఫిబ్రవరి 22 వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాజకీయాలకు సంబంధించిన సినిమా కావడంతో అంచనాలు ఉన్నాయి. తెలిసిన కథే కావడం.. కొంతవరకే చూపిస్తారని తెలియడంతో సినిమాను ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి.