ఎన్టీఆర్, బాబీల ఫస్ట్ టైటిల్!

ఫస్ట్ టైటిల్ సంగతేంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే కదా.. ఫ్యాషన్. స్టార్ హీరో సినిమా మొదలవుతుందంటే చాలు.. వారు టైటిల్ అనౌన్స్ చేయకమునుపే సోషల్ మీడియాలో రకరకాల పేర్లు టైటిల్స్ గా వినిపిస్తుంటాయి. చిత్రబృందం కూడా అందులో మంచి టైటిల్ చూసి తమ సినిమా టైటిల్ గా పెట్టుకుంటున్నారనుకోండి. ఇప్పుడు ఎన్టీఆర్, బాబీల సినిమాకు సంబంధించి కూడా ఓ టైటిల్ వినిపిస్తోంది. అదే ‘నట విశ్వరూపం’. ఈ సినిమా ఎన్టీఆర్ మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్నట్లు సమాచారం.

అందుకే కథకు ఈ టైటిల్ పెర్ఫెక్ట్ అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ కనిపించబోతున్నారు.. వీటితో పాటు బోనస్ గా ఐటెమ్ సాంగ్ కోసం మరో స్టార్ హీరోయిన్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. నట విశ్వరూపం టైటిల్ ఎన్టీఆర్ కు తగ్గట్లుగానే ఉంది. మరి టైటిల్ గా ఇంకెన్ని పేర్లు వినిపిస్తాయో చూడాలి!