బాలకృష్ణ ‘నర్తనశాల’ ట్రైలర్‌


నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో ప్రారంభించిన పౌరాణిక చిత్రం ‘నర్తనశాల’. కొంతమేర షూటింగ్‌ జరుపుకొన్న ఈ సినిమా అనివార్య కారణాలతో ఆగిపోయింది. తాజాగా విజయదశమి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన 17 నిమిషాల వీడియో రిలీజ్‌ చేయనున్నట్లు బాలకృష్ణ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు గురువారం ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. అర్జునుడి గెటప్‌లో బాలయ్య అభిమానుల్ని ఆకట్టుకున్నారు. ఇక ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్‌బాబులుగా కనిపించారు. సౌందర్య, శ్రీహరి అభిమానులు వారిని చూసి ఆనందపడుతున్నారు. ఇక విజయదశమి సందర్భంగా అక్టోబరు 24న శ్రేయాస్‌ ఈటీ వేదికగా ఉదయం 11.49గంటలకు 17నిమిషాల వీడియోను వీక్షించవచ్చు.

 

క్లాప్ బోర్డ్‌తో గుత్తాజ్వాల స్పెషల్ ఇంటర్వ్యూ

CLICK HERE!! For the aha Latest Updates