తమన్ ను తప్పించనున్నారా..?

‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే తన 151 వ చిత్రం ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ ప్రాజెక్ట్ ను తెరపైకి తీసుకురానున్నారు. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. భారత స్వాతంత్ర సమరానికి ముందు బ్రిటిషర్ల తలలు నరికిన పోరాటయోధుడి చరిత్రగా ఈ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. మొన్నమధ్య మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ‘మై బిగ్గెస్ట్ సెన్సేషన్’ అంటూ దర్శకుడు సురేందర్ రెడ్డితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సురేందర్ రెడ్డి-తమన్ కలిసి కొన్ని సిట్టింగ్స్ కూడా వేశారు. దీంతో తమన్ ‘ఉయ్యాలవాడ’ చిత్రానికి మ్యూజిక్ అందించబోతున్నాడనే అందరూ అనుకున్నారు.
కానీ ఇప్పుడు మెగాక్యాంప్ నుండి తమన్ కు షాక్ తగిలినట్లుగా తెలుస్తోంది. ఉయ్యలవాడ నిర్మాత రామ్ చరణ్ ఈ ప్రాజెక్ట్ కు మరింత క్రేజ్ రావడానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ తో ఈ సినిమాకు మ్యూజిక్ చేయించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ విషయమై రెహ్మాన్ ను సంప్రదించినట్లుగా తెలుస్తోంది. అయితే ఆయన నుండి ఎటువంటి స్పందన రాలేదట. ఒకవేళ రెహ్మాన్ అంగీకరిస్తే ఇక తమన్ ను పక్కన పెట్టడం ఖాయమన్నమాట. 
 
 
Attachments