
NTR Neel Dragon:
జూనియర్ ఎన్టీఆర్ మరియు ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన తాజా అప్డేట్ అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది. ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ మొదలైన ఈ చిత్రానికి ఇప్పుడు కొత్త పేరు వెతుకుతున్నారు!
ఒకే పేరుతో 2025లో ఒక తమిళ చిత్రం విడుదలైంది. అదే ‘డ్రాగన్’ పేరుతో తెలుగులో కూడా డబ్ అయ్యింది. ఇప్పుడు అదే పేరును మళ్లీ తెలుగు సినిమాకి పెట్టడం కుదరదు. లీగల్ ఇష్యూలు వస్తాయి, అలాగే ప్రేక్షకుల్లో కూడా కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి, మేకర్స్ ఇప్పుడు సేఫ్ వైపు చూసి టైటిల్ మార్చాలని డిసైడ్ అయ్యారు.
View this post on Instagram
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కు బడ్జెట్ ఎంతో భారీగా ఉందని టాక్. అందుకే టైటిల్ కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉండాలి అనే ప్లానింగ్‌లో ఉన్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి ఇప్పటివరకు ఉన్న టైటిల్ ‘డ్రాగన్’ హైప్ తీసుకొచ్చిందనేది నిజమే కానీ, కొత్త టైటిల్ మాత్రం ఊహించని స్టైల్లో ఉండే అవకాశం ఉంది.
ఈ సినిమా 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఎన్టీఆర్ ప్రస్తుతం హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్న ‘వార్ 2’ షూటింగ్‌లో ఉన్నారు. ఆగస్ట్ 14, 2025న విడుదల కానున్న ఈ సినిమాలో కియారా అడ్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.
డ్రాగన్ అనే పేరు కంటే బెటర్ టైటిల్ వచ్చే ఛాన్స్ బాగానే ఉంది. ఎన్టీఆర్ అభిమానులూ, మాస్ ఆడియెన్స్ కోసం ప్రశాంత్ నీల్ ఇచ్చే బంగారు బాణం ఏంటో చూద్దాం మరి!
ALSO READ: Godari Gattu పాట తర్వాత భీమ్స్ రెమ్యూనరేషన్ ఇంత పెరిగిపోయిందా?













