HomeTelugu Trending'ఆర్‌ఆర్‌ఆర్‌'లో ఎన్టీఆర్‌ రొమాంటిక్ సాంగ్ అదిరిపోతుందట..

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఎన్టీఆర్‌ రొమాంటిక్ సాంగ్ అదిరిపోతుందట..

12 18టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమాను ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక యోధులైన అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో.. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తుండంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్ నటిస్తుంది. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా.. అతడితో ప్రేమలో పడే బ్రిటిష్ అమ్మాయిగా ఒలివియా కనిపించనుందట. ఇక రాజమౌళి ఎన్టీఆర్ తో తీసిన అన్నీ సినిమాలలో మంచి రొమాంటిక్ సాంగ్స్ రూపొందించిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ తో ఓ లవ్ ట్రాక్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని అన్నీ పాటలకంటే భిన్నంగా.. రొమాంటిక్ గా ఉంటుందట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu