‘దీప్ వీర్’ రిసెప్షన్.. హజరైన ప్రముఖులు.. దీపీక ఫోటోలు వైరల్

బాలీవుడ్‌ నూతన దంపతులు దీపిక పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌ ముచ్చటగా మూడోసారి వివాహ విందులో సందడి చేశారు. శనివారం రాత్రి ముంబయిలోని గ్రాండ్‌ హయత్‌ హోటల్‌లో బాలీవుడ్‌ తారల కోసం ఈ వివాహ వేడుకను ఏర్పాటుచేశారు. వేడుకలో రణ్‌వీర్‌ బ్లాక్‌ సూట్‌ను ధరించారు. దీపిక ఎరుపు రంగు గౌనులో తళతళ మెరిసిపోయారు. ఈపార్టీలో రణ్ వీర్, దీపికా ఫోజులిచ్చిన ఫోటోలను దీప్స్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఈ ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.నవంబర్‌ 21న బెంగళూరులో కుటుంబీకుల కోసం వివాహ విందును ఏర్పాటుచేశారు. ఆ తర్వాత 28న మీడియా ప్రతినిధుల కోసం మరో విందును ఏర్పాటుచేశారు. సినీ ప్రముఖుల కోసమే కాకుండా మీడియా ప్రతినిధులకు కూడా వివాహ విందును ఏర్పాటుచేసిన ఏకైక సెలబ్రిటీ జంట ‘దీప్‌వీర్‌’ కావడం విశేషం.

వివాహ విందుకు అమితాబ్‌ బచ్చన్‌, జయా బచ్చన్‌, ఐశ్వర్య రాయ్, అనుష్క శర్మ, హృతిక్‌ రోషన్‌, షారుక్‌ ఖాన్‌, శత్రుఘ్న సిన్హా, సోనాక్షి సిన్హా, సైఫ్‌ అలీ ఖాన్‌, కరీనా కపూర్‌, సారా అలీ ఖాన్‌, శిల్పా శెట్టి, కరణ్‌ జోహార్, రిలయన్స్‌ సంస్థల అధినేత ముఖేశ్‌ అంబానీ, నీతా అంబానీ, ఈశా అంబానీ, శ్లోకా మెహతా, ఆకాశ్‌, అనంత్‌, రాధికా మర్చెంట్‌, అనిల్‌ కపూర్‌, ఫరా ఖాన్‌, వాణీ కపూర్‌, రాణీ ముఖర్జీ, సంజయ్‌ దత్‌, రాధికా ఆప్టే, లారా దత్తా, మహేశ్‌ భూపతి, విద్యా బాలన్‌, సచిన్‌ టెండుల్కర్‌, అంజలి, అర్జున్‌ టెండుల్కర్‌, హేమమాలిని, దిశా పటానీ, టైగర్‌ ష్రాఫ్‌, షబానా అజ్మీ, జావేద్‌ అక్తర్‌, రేఖ, కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, దియా మీర్జా, జాన్వి కపూర్‌, బోనీ కపూర్‌, ఖుషి కపూర్‌, అర్జున్‌ కపూర్‌, మలైకా అరోరా, రాజ్‌కుమార్‌ రావు, అదితి రావు హైదరి తదితరులు హాజరయ్యారు.

View this post on Instagram

With the Bride ❤️

A post shared by Bosco Martis (@boscomartis) on