HomeTelugu Big Storiesఈఫిల్‌ టవర్‌ ముందు కొడుకుతో ఎన్టీఆర్‌.. ఫొటో వైరల్‌

ఈఫిల్‌ టవర్‌ ముందు కొడుకుతో ఎన్టీఆర్‌.. ఫొటో వైరల్‌

ntr shares photo with his s

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ వీలు దొరికినప్పుడల్లా ఫ్యామిలీకి సమయం కేటాయిస్తుంటారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనలో ఉన్నారు. భార్య ప్రణతి, కొడుకులు అభయ్‌ రామ్‌, భర్గవ్‌ రామ్‌తో కలిసి ఫ్రాన్స్‌లో హాలిడే ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఎన్టీఆర్‌ తన కొడుకు అభయ్‌ రామ్‌తో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేశారు. ఈఫిల్‌ టవర్‌ ముందు కొడుకు బుగ్గలపై ఎన్టీఆర్‌ప్రేమతో ముద్ధాడుతుండగా.. అభయ్‌ నవ్వులు చిందిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తండ్రి ప్రేమను చూపిస్తున్నాడని అభిమానులను కామెంట్స్‌ చేస్తున్నారు. సుమారు వారం, పది రోజులు ఎన్టీఆర్‌యూరప్‌లోనే ఉండనున్నారని తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌తో బిజీగా ఉన్న యంగ్‌ టైగర్‌ ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్నారు. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, అలియా భట్‌ ముఖ్యపాత్రలో నటించిన ఈ సినిమా జనవరి 7, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu