ఎన్టీఆర్ బాగానే రౌండప్ చేశాడు!

‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. దర్శకుడిగా అతడి తొలి సినిమా హీరో ఎన్టీఆర్ తో చేశాడు. ఆ తరువాత సోషియో ఫాంటసీ, గ్రాఫిక్స్ తో కూడిన తొలిప్రయత్నం ‘యమదొంగ’ కూడా ఎన్టీఆర్ తోనే చేశాడు. అప్పటినుండి కూడా ఎన్టీఆర్ తో మరో సినిమా చేయాలనే ఆలోచన అయితే రాజమౌళికి ఉంది. కానీ దానికి సమయం, స్క్రిప్ట్ కుదరడం లేదు. బాహుబలి తరువాత ఏ సినిమా చేయాలనే విషయంలో రాజమౌళి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి రాజమౌళితో సినిమా చేయడానికి ఇదే సరైన సమయమని భావించిన ఎన్టీఆర్ తన ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. ఈసారి ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ రాజమౌళి దొరకడం కష్టం. 
ఈ విషయం గ్రహించిన ఎన్టీఆర్ అతడితో సినిమాకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. దానయ్య బ్యానర్ లో రాజమౌళి డేట్స్ ఉన్నాయి కాబట్టి అటు నుండి నరుక్కొస్తున్నాడు. దానయ్య దగ్గర ఎన్టీఆర్ డేట్స్ కూడా ఉండడం కలిసొచ్చే విషయం. మరోవైపు రాజమౌళి సన్నిహిత వర్గం మొత్తాన్ని కూడా ఎన్టీఆర్ ఉపయోగించుకుంటున్నాడు. తారక్ తోనే నెక్స్ట్ సినిమా చేయాలని రాజమౌళిపై ఒత్తిడి తెచ్చేలా చేస్తున్నాడు. ఎన్టీఆర్ కూడా అన్ని కమిట్మెంట్స్ వదిలేసి రావడానికి కూడా సిద్ధమని, ఎంత సమయమైనా.. కేటాయిస్తానని సంకేతాలు పంపిస్తున్నాడట. రాజమౌళి ఇంకా ఈ విషయంలో నిర్ణయం తీసుకోకపోయినా.. అతడి ప్రయారిటీ లిస్ట్ లో ఎన్టీఆర్ పేరైతే ఉంది. మరి ఇన్ని రకాలుగా ప్రయత్నిస్తోన్న ఎన్టీఆర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?