‘అరవింద సమేత’ డేట్‌ ఫిక్స్‌

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం ‘అరవింద సమేత’. ఇప్పటికే టీజర్‌, ఫస్ట్‌ లుక్స్‌, పాటలతో సందడి చేస్తోన్న ఈ సినిమా దసరా కానుకగా విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం.

అక్టోబర్‌ 11న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదల కానుందని చిత్రయూనిట్‌ ప్రకటించారు. ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మొదటిసారి సినిమా రావడం, త్రివిక్రమ్‌ శైలికి భిన్నంగా ఫ్యాక్షన్‌ నేపథ్యంలో సినిమా తెరకెక్కడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించగా, థమన్‌ సంగీతాన్ని అందించారు. సీనియర్‌ నటుడు నాగబాబు ఎన్టీఆర్‌కు తండ్రి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సిక్స్‌ ప్యాక్‌తో ప్రేక్షకులను అలరించనున్నారు. ఇందులో తారక్‌ చిత్తూరు యాసలో సందడి చేయనున్నారట. జగపతిబాబు, సునీల్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.