HomeTelugu Trendingఎన్టీఆర్‌ ఇంటి ముందు అభిమానుల సందడి..

ఎన్టీఆర్‌ ఇంటి ముందు అభిమానుల సందడి..

10
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఇంటి ముందు ఫ్యాన్స్‌ సందడి చేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తారక్‌కు శుభాకాంక్షలు చెప్పడానికి అభిమానులు ఆయన ఇంటి ముందు గుమిగూడారు. వారిని పలకరించేందుకు తారక్‌ మేడపైకి వచ్చారు. అందరికీ అభివాదం చేసి.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

‘అరవింద సమేత’ హిట్‌ తర్వాత తారక్‌ భారీ ప్రాజెక్టు ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ మరో హీరోగా నటిస్తున్నాడు. ఆలియా భట్‌, ఒలివియా మోరిస్‌ హీరోయిన్‌లు. రూ.350 కోట్ల బడ్జెట్‌తో దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను జులై 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తారక్‌ ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్‌తో కలిసి పనిచేయనున్నారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu