HomeTelugu Trendingకీర్తి సురేశ్‌ కూడా బాలయ్యకు నో చెప్పేసిందట!

కీర్తి సురేశ్‌ కూడా బాలయ్యకు నో చెప్పేసిందట!

2 25
టాలీవుడ్‌ ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ .. బోయపాటి శ్రీను ఒక యాక్షన్ ఎంటర్టైనర్ ను రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా నయనతారను అనుకున్నారు. అయితే తనకి గల కమిట్మెంట్స్ కారణంగా కుదరదని నయనతార చెప్పిందట .. దాంతో శ్రియను తీసుకున్నారు.

ఇక మరో హీరోయిన్‌ పాత్ర కోసం కీర్తి సురేశ్ ను సంప్రదించారట. ఆమె కూడా తన డేట్స్ లేవంటూ సున్నితంగానే తిరస్కరించినట్టు తెలుస్తుంది. ఆ సమయంలోనే కేథరిన్ ను సంప్రదించగా, భారీ పారితోషికాన్ని అడిగిందట. అప్పుడే అంజలి పేరును పరిశీలించి ఓకే చేసినట్టుగా తెలుస్తోంది. గతంలో ‘డిక్టేటర్’ చిత్రంలో బాలకృష్ణకి జోడీగా అంజలి కనిపించింది. ఆ సినిమా మాస్ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది. ఇటీవల కాలంలో అంజలికి కూడా ఇక్కడ అవకాశాలు లేకుండా పోయాయి. బోయపాటి సినిమాతో ఆమె కెరియర్ మళ్లీ ఊపందుకుంటుందేమో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu