HomeTelugu News'అరవింద సమేత' మేకింగ్‌ వీడియో.. త్రివిక్రమ్‌ ఒడిలో అభయ్‌ అల్లరి‌

‘అరవింద సమేత’ మేకింగ్‌ వీడియో.. త్రివిక్రమ్‌ ఒడిలో అభయ్‌ అల్లరి‌

జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘అరవింద సమేత వీరరాఘవ’. ఈ చిత్రనికి త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌. ఈ సినిమాకి తమన్‌ బాణీలు సమకూరుస్తున్నారు. కాగా బుధవారం ఈ సినిమా మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. ‘అరవింద సమేత’ సెట్స్‌లో ఏం జరిగిందో చూడండి’ అని హారిక అండ్‌ హాసిని సంస్థ ట్వీట్‌ చేసింది. సినిమా షూటింగ్ చాలా సరదాగా జరిగినట్లు దీన్ని చూస్తే తెలుస్తోంది. ఎన్టీఆర్‌ తనయుడు అభయ్‌ రామ్‌.. త్రివిక్రమ్‌ ఒడిలో కూర్చుని అల్లరి చేస్తూ కనిపించాడు.

7 2

ఈ చిత్రంలో ఈషా రెబ్బా, సునీల్‌, జగపతిబాబు, రావు రమేశ్‌, సితార, బ్రహ్మాజీ, నవీన్‌ చంద్ర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పీసీ వినోద్‌ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అక్టోబరు 11న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu