వెంకీ మెసేజ్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

వెంకటేష్ లో టాలీవుడ్ లో నెంబర్ వన్ ప్రొడ్యూసర్ కుమారుడనే గర్వం గానీ.. వరుస హిట్స్ ఇచ్చిన
హీరో అనే పొగరు గానీ ఏ మాత్రం కనిపించదు. కామ్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతాడు.
అటువంటి వెంకీ చేసిన ‘సే నో టు పీయర్ ప్రెషర్’ అనే యాడ్ చాలా మందిని ముఖ్యంగా యూత్
ను ఆలోచింపజేస్తోంది. తన స్టయిల్ లో వెంకీ చెప్పిన డైలాగ్స్ ఇంటర్నెట్ లో నెటిజన్స్ ను
ఆకట్టుకుంటున్నాయి. స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్స్ వంటి విషయంలో మన చుట్టూ ఉన్న వ్యక్తులు
మనల్ని ప్రభావితం చేస్తుంటారు. మీ తోటి మిత్రులు నేర్పే అలవాట్లను నేర్చుకోకపోతే వారు మిమ్మల్ని
వీడి వెళ్లిపోతారనే ఒత్తిడితో అలవాట్లకు బానిస కావొద్దు.. అలాంటి వారికి నో చెప్పడం నేర్చుకోవాలని..
పరిసరాలను పరిశీలిస్తూ.. ఉండాలి. చుట్టూ ఉన్నవాళ్ళ నుండి మనం ఏం నేర్చుకోవాలి..? ఎలాంటి
విషయాలకు దూరంగా ఉండాలనే విషయంలో స్పష్టత ఉండాలి. నిమిషం ఆనందం కోసం జీవితంతో
ఆడుకోవడం మూర్ఖత్వం. జీవితాన్ని ఆస్వాదించండి.. అంటూ వెంకీ చెప్పిన తీరు ప్రతి ఒక్కరినీ
ఆలోచింపజేసే విధంగా ఉంది. జెన్నీఫర్ ఆల్ఫోన్స్ డైరెక్ట్ చేసిన ఈ వీడియోను టీనేజ్ ఫౌండేషన్
నిర్మించింది.