HomeTelugu Trendingతమిళంలో 'ఓ బేబీ'

తమిళంలో ‘ఓ బేబీ’

5 7ఓ దక్షిణ కొరియా మూవీ ఆధారంగా తెరకెక్కిన తెలుగు చిత్రం ‘ఓ బేబి’. ఈ సినిమాలో ప్రముఖ నటి సమంత, సీనియర్‌ నటి లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. బీవీ నందినిరెడ్డి దర్శకత్వం వహించారు. వృద్ధురాలైన లక్ష్మి యవ్వనంగా మారితే, ఆ తర్వాత ఏంజరుగుతుంది?.. అనే విషయానికి కాస్త హాస్యాన్ని జోడించి చిత్రీకరించారు. ఇందులో నాగశౌర్య, రాజేంద్రప్రసాద్‌, ఊర్వశిలు కూడా నటించారు. మిక్కీజే మేయర్‌ సంగీతం అందించారు. ఈ సినిమా నిర్మాణ బడ్జెట్‌ కన్నా ఎక్కువగానే వసూళ్లు రాబట్టిందని సమాచారం. సమంత నటనకు తగిన గుర్తింపు కూడా లభించింది. ఇప్పుడు ఈ సినిమాను అదే పేరిట తమిళంలో రీమేక్‌ చేస్తున్నారు. ఆగస్టు 15న సినిమాను విడుదల చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల విడుదలైన ‘పేరళగి ఐఎస్‌ఓ’ కూడా ఇలాంటి కథాంశంతో రూపొందిన సినిమానే కావడం గమనార్హం. ఇందులో సీనియర్‌ నటి సచ్చు, శిల్ప మంజునాథ్‌లు నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu