HomeTelugu Trending‘కొండపొలం’ ఫస్ట్‌ సాంగ్‌ వచ్చేసింది!

‘కొండపొలం’ ఫస్ట్‌ సాంగ్‌ వచ్చేసింది!

Obulamma video song from Ko
మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా నటింస్తున్న చిత్రం ‘కొండపొలం’. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమాలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్ గా నటిస్తోంది. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి నిర్మించారు. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన కొండపొలం నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం, అక్టోబరు 8న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

ఈనేపథ్యంలో తాజాగా రకుల్ ప్రీత్ పాత్రను తెలియజేస్తూ ‘ఒబులమ్మ’ పాటను విడుదల చేశారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ పాటను గాయకులు సత్య యామిణి, పీవీఎన్‌ఎస్‌ రోహిత్‌లు ఆలపించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రీ, చంద్రబోస్‌లు పాటకు సాహిత్యం అందించారు. ఈ సాంగ్‌లో వైష్ణవ్‌-రకుల్‌ మధ్య కెమిస్ట్రీ బాగా పడింది.ఇందులో ఓబులమ్మ అనే పల్లెటూరి అమ్మాయిగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటించింది. ఈ పాట సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu