HomeTelugu Trendingహాయ్‌ నాన్న: పార్టీ సాంగ్‌ విడుదల

హాయ్‌ నాన్న: పార్టీ సాంగ్‌ విడుదల

Odiyamma song from Hi Nanna
నేచురల్‌ స్టార్ నాని- బాలీవుడ్ భామ మృణాళ్‌ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘హాయ్‌ నాన్న’. . శౌర్యువ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 7న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ స్వీడ్‌ పెంచారు. మేకర్స్ ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ సినిమా నుండి పార్టీ సాంగ్‌ను లాంఛ్ చేశారు. ఓడియమ్మా హీటు.. ఈడీఎంలో బీటు అంటూ హేశమ్‌ అబ్దుల్‌ వహబ్‌ కంపోజిషన్‌లో సాగుతున్న ఈ పాటను అనంత శ్రీరామ్‌ రాశాడు.
ఈ పాటను విక్రమ్‌ కొడుకు, యాక్టర్‌ ధ్రువ్‌ విక్రమ్‌, చిన్మయి శ్రీపాద, శృతిహాసన్‌ పాడటం విశేషం. ఈ పార్టీ సాంగ్‌లో శృతిహాసన్‌ హాట్ లుక్‌లో అదరగొట్టేస్తుండగా.. నాని చాలా కాలం తర్వాత స్టైలిష్‌ సాంగ్‌లో కనిపిస్తూ టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిపోయేలా ఉన్నాడంటున్నారు సినీ జనాలు.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ మూవీకి మలయాళం కంపోజర్‌, హృదయం ఫేం హేశమ్‌ అబ్దుల్‌ వహబ్ సంగీతం అందిస్తున్నాడు. ఖుషి తర్వాత మరో బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌ రెడీ చేసినట్టు ఇప్పటివరకు రిలీజైన పాటలతో క్లారిటీ ఇచ్చేస్తున్నాడు హేశమ్‌. ఈ మూవీని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్‌ చెరుకూరి (CVM), డాక్టర్ విజేందర్‌ రెడ్డి తీగల, మూర్తి కేఎస్‌ తెరకెక్కిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu